Miracles

Home | Miracles | Page 13

ఈ రోజు మరియు ఎల్లప్పుడు ప్రభువును స్తుతిద్దాం!

స్తుతి, ఆరాధన యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాను, ఆకాశం నీలం లేదా బూడిద రంగులో ఉందా … ఎటువంటి పరిస్థుతులైన స్తుతి ఆరాధన ముఖ్యం అని నేను భావిస్తాను, ఎందుకంటే   మహిమలకు అర్హుడు! దేవుణ్ణి స్తుతించడం ఎంత మంచిది! తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మను మహిమపరచడానికి మనం మొట్టమొదటగా చేస్తున్నప్పుడు, అది మనకు ఎంత మేలు చేస్తుందో నేను గ్రహించాను. దేవుని వాక్యము , “సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.” యెషయా 61:3 హల్లెలూయా! అవును, ఈ అందమైన ఉల్లాస  వస్త్రం ఆయన మహిమ కోసమే! ఈ వచనాలనుాతో కీర్తనల నుండి ప్రకటించండి. వాటిని మీ హృదయపూర్వకంగా ప్రకటించండి! “యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.” కీర్తనలు 149:1 “యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.” కీర్తనలు 147:1 “యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.” కీర్తనలు 150:1&2 “యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,నీ నామమును కీర్తించుట మంచిది….

క్షమించండి

చాలా సంవత్సరాల క్రితం, నేను మరియు నా భార్య కష్టపడుతున్నాము. మా మొదటి ఐదు సంవత్సరాల వివాహం చాలా కఠిననంగా ఉండింది. మేమిద్దరం చాలా చిన్నవాళ్ళం మరియు కలిసి జీవితం కోసం సిద్ధంగా లేము. చివరికి,  మేము కౌన్సెలింగ్ కోసం వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మా ఫిర్యాదులను విన్న తరువాత, కౌన్సిలర్ మా జీవితాలను సరిదిద్దే ఒక విషయం చెప్పాడు: “మీరిద్దరూ ఒకరినొకరు క్షమించుకోవాలి.” ఇది చాలా సులభం అనిపిస్తుంది, కదా?  కొన్నిసార్లు బైబిల్ సరళమైనది కాని కఠినమైనది. “తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు.”లూకా 6:37-38 క్షమాపణ అనే భావనకు కొన్ని ఆచరణాత్మక దశలను పెట్టడానికి నన్ను అనుమతించండి: క్షమించటంమొదటి అడుగు క్షమాపణ ప్రక్రియ ఈ మొదటి దశను డెబ్బది ఏళ్ల మారులవరకు కొనసాగిస్తుంది. మీరు మరలా మరలా క్షమించండి … మీరుక్షమించే స్థితికి చేరుకుంటారు. మీరు నేరాల గురించి ఆలోచించగలిగినప్పుడు   నొప్పి ఏ మాత్రము ఉండదు ….

పట్టుదల కలిగి ఉండండి

ఈ రోజు దేవుడు తన ప్రేమతో మరియు కదిలించలేని ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని చుట్టుముట్టమని నేను ప్రార్థిస్తున్నాను. “ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.”  కొలొస్సయులకు 1:11-12 ఈ రోజు ఈ క్రింద వాక్య భాగాలను చదివి ధ్యానించమని కోరొతున్నాను: “గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము”  హెబ్రీయులకు 4:16 “అంతట యెహోవా అతనితట్టు తిరిగిబలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా.” న్యాయాధిపతులు  6:14 “నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.” యెషయా 45:2  “నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” మత్తయి 28:20 మీకు దేవుని సహాయం అవసరమైతే, ఈ రోజు నాతో ప్రార్థన చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను … “ప్రభువా, కొన్నిసార్లు నేను అలసిపోతున్నాను మరియు ఇవన్నీ వదిలిపెట్టి వదిలివేయాలనుకుంటున్నాను. అయినప్పటికీ, మీ సంకల్పం నేను నిలువరించలేనని నాకు తెలుసు.  మీరు నన్ను నడిపిస్తున్న దిశలో కొనసాగడం, కష్టతరమైనప్పుడు కూడా, ఇవన్నీ ఎలా మారుతాయో నేను చూడలేనప్పుడు, మీ సహాయంతో, నేను ముందుకు సాగడానికి, పట్టుదలతో, విశ్వాసంతో  కొత్త దశలను తీసుకోవడానికి, ధైర్యం చేయడానికి ఎంచుకున్నాను!…

కొనసాగించండి – ఆయన మీతో ఉన్నాడు.

2 కొరింథీయులకు 4: 8-10లో దేవుని వాక్యంలో మనం చదువుతాము, “..ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము. యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై…

ఆగకండి ముందుకు సాగండి!

“నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.” కీర్తనలు 73:26 చాలా విషయాలపై మనము అన్నిటిని నిష్క్రమించాలని అనుకుంటాము, ఇకపై ఆశలు లేవని మనమునమ్ముతాము: దుఃఖం, అలసట, ఆరోగ్య సమస్యలు, విభేదాలు మరియు ఘర్షణలు, కరోనావైరస్ యొక్క ప్రభావాలు, మనం ఎదుర్కోవాల్సిన అనేక ఇతర సవాళ్లు. .. దేవుని వాక్యంలో, స్త్రీపురుషుల ఉదాహరణలు చాలా ఉన్నాయని మీకు తెలుసా? మీరు ఒంటరిగా లేరు! ఒక ఉదాహరణ దేవుని ప్రఖ్యాత ప్రవక్త  ఏలీయా ! ఒక రోజు,  యెజెబెలు నుండి తనకు మరణ ముప్పు వచ్చిన తరువాత, తనను చనిపోనివ్వమని దేవుడిని కోరాడు. 1 రాజులు 19: 2-8 చదవమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రహస్యం ఏంటంటే… ఆపకుండా కొనసాగించడం, పట్టుదలతో! దేవుని దూత  ఏలీయాను తినమని ఆజ్ఞాపించాడు. మరియు ఈఆహారం నుండి తనకు లభించిన బలంతో, అతను లేచి మళ్ళీ నడవడం ప్రారంభించాడు….అది ఎంత నడక! అతను దేవుని పర్వతానికి వచ్చేవరకు 40 పగలు 40 రాత్రులు!…

ఆశ కోల్పోయారా?

నేను ఒప్పుకొంటున్నాను, కొన్నిసార్లు  నేను రేపు సూర్యోదయం అవుంతుందా అని నేను అంకుంటాను ఎందుకంటే  ఈ మహమ్మారిన్నినివారించడానికి మనము చేసిన ప్రయత్నాలు ఫలించేటట్లు అనిపించదు… ఆశను కోల్పోతాము. ఆశ అనేది మన జీవితాలన్నిటిలో ఒక ముఖ్యమైన అంశం. మంచి భవిష్యత్తు, జీవితం మరియు ఆరోగ్యం యొక్క ఆశ. మీరు మంచి భవిష్యత్తును ఆశిస్తున్నారా? మీ ఆశలు ప్రతికూలత లేదా ఆలస్యం వల్ల నలిగిపోయాయా? బైబిల్ మనకు చెబుతుంది, “కోరిక సఫలము…

మీరు సిద్ధంగా ఉన్నారా?

నా మనవడు లూకా తన తండ్రితో ఫ్రాన్స్ వెళ్ళడం గురించి ఎప్పుడూ కలలు కనేవాడు. కనుక ఇది నిజం అయినప్పుడు మేము ఇద్దరూ అనుభవించిన ఉత్సాహాన్ని మీరు ఊహించవచ్చు. అతను చూడాలనుకున్న స్థాలాల గురించి మేము మాట్లాడాము. అక్కడ వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉండింది..చుట్టూ మంచు! కాని నా స్నేహితుడు నన్ను హెచ్చరించనందుకు వెచ్చని బట్టలు తీసుకున్నాము,  దేవునికి ధన్యవాదాలు. మీరు ఎప్పుడైనా  ఒక ముఖ్యమైన సమావేశానికి లేకా కొత్త ప్రదేశానికి సిద్దపడకుండా వెళ్ళారా? బైబిల్ మనకు చెబుతుంది, “కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.”  కొలొస్సయులకు 3:12 మనలో చాలా మంది మన బట్టలు మరియు అలంకరణలను తయారు చేయడానికి ఎక్కువ సమయం గడుపుతాము…. ఇది నాకు చాలా ఆశ్చర్యం ఎందుకంటే  మనము మన అంతరంగాలను విస్మరిస్తాము.మనము తరచూ మానసికంగా లేదా ఆధ్యాత్మికంగా నగ్నంగా సమావేశాలకు వెళ్తాము. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. మనము ప్రతిరోజూ ప్రారంభించే ముందు సరైన వైఖరులు మరియు ఆత్మీయ దుస్తులను  ధరించే ప్రయాణంలో నాతో చేరండి: బాధ, కోపం, అసూయ& ఏదైనా భావోద్వేగ వ్యర్థాలను వదిలించుకోండి ఆత్మతోనిండి ఉండండి….

దేవుని వాక్యం ప్రకటించండి

మిత్రమా, మీకు వ్యతిరేకంగా ఒక పర్వతం ఉందా? ఇబ్బందులు, సమస్యలు, విరిగిన సంబంధాలు, విచారం, ఒంటరితనం, అనారోగ్యం… ఈ రోజు, యేసు మాటల ప్రకారం, ఈ పర్వతాన్ని తరలించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, “ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్ర ములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమి్మనయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” మార్కు 11:23 దేవుని వాక్యం  ప్రకటించడం చాలా శక్తివంతమైనది…. “…తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని..” సందేహించకండి … నమ్మండి దేవునిపై మీ…

మీ అంతర్గత సంభాషణ ఏమిటి?

“నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.” కీర్తనలు 94:18-19 మనమందరం  చాల సార్లు మనతోనే, మనలో మనం  మాట్లాడుకుంటాం. మీ సంగతి ఏమిటి? మీ అంతర్గత సంభాషణ యొక్క రహస్య ప్రదేశంలో మీరు సాధారణంగా మీ గురించి ఏమి పునరావృతం చేస్తారు? మీరు మీ గురించి ఏ పదాలు వాడుతారు? మనలో కొందరు మనము.. విశ్వాసంలో బలంగా లేమని, తగినంత విధేయత లేదని, ధైర్యం  లేదని,…

వాక్యం పై ధ్యానించడం అంటే ఏమిటి?

విజయంతో నడవడానికి మీకు సహాయపడటానికి నేను నేర్చుకున్న కొన్ని సూత్రాలను పంచుకోవాలనుకుంటున్నాను, ప్రత్యేకించి, మనము మహమ్మారి  కరోనావైరస్ను అధిగమించి, పునరుద్ధరణ సమయాల్లోకి వెళ్తాము.  మనము దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలో మరియు మీ జీవితంలో దేవుడు చెప్పేదాన్ని మీరు ఎలా శక్తివంతంగా ప్రకటించవచ్చో చర్చిస్తాము. మీరు గొప్ప విజయాలు చూస్తారని నేను మీతో నమ్ముతున్నాను. “దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.”  కీర్తనలు 1:1-3 వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏమిటి? ఇది దేవుడు తన ఆలోచనలను మీ హృదయంలో చెక్కడానికి అనుమతించడం. దేవుని వాక్యం సమతుల్య జీవితానికి, ఆరోగ్యకరమైన మరియు అభివృద్ధి చెందుతున్న జీవనానికి మూలం.  ఇది మిమ్మల్ని విముక్తి చేస్తుంది, మిమ్మల్ని స్వస్థపరుస్తుంది మరియు మీకు ఆహారం ఇస్తుంది.  ఇది మీ ఆత్మకు నిధి, మీరు ఏ క్షణంలోనైనా ఉపయోగించగల శక్తివంతమైన ఆయుధం. దేని కొరకు? దేవునివాక్యం దేవుని ప్రేమను మీకు తెలియపరుస్తుంది దేవునివాక్యం మీకు ఓదార్పునిస్తుంది దేవునివాక్యం ఆయన చిత్తాన్ని తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుంది దేవునివాక్యం మీ ఆత్మను బలపరుస్తుంది దేవునివాక్యం ఆయన విశ్వాసాన్ని ప్రకటించటానికి మీకు సహాయం చేస్తుంది అవును, దేవుడు నమ్మకమైనవాడు! ఆయన మీకు విశ్వాసపాత్రుడు, . ఆయన…