Miracles

Home | Miracles | Page 15

ప్రార్థనలో కొనసాగండి

నా జీవితంలో వందలాది మంది జవాబు లేని ప్రార్థనలతో నిరాశ చెందారు. క్రొత్త క్రైస్తవుడిగా, నాకు దేవునిపై చాలా విశ్వాసము ఉండింది  .ఆయన నా జీవితంలో కొద్ది సంవత్సరాలలో  చాలా మేలులనుచేసాడు. నా విశ్వాసం పరీక్షించబడిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను.  నేను, నా నా కాబోయే భార్య మరియు ఆమె కుటుంబ సభ్యులు    ప్రయాణం చేస్తుండగా, కారులో పెట్రోలు అయిపోయంది. అతీంద్రియంగా నా ట్యాంక్ నింపమని దేవుడిని కోరినప్పుడు మొత్తం సమూహం ఒక అద్భుతం కోసం వేచి ఉంది. మేము వేచి ఉండి, వేచి ఉండి, దాన్ని ప్రారంభించడానికి చాలాసార్లు ప్రయత్నించాము, కానీ ప్రయోజనం లేకపోయింది. మీ ప్రార్థనలకు సమాధానం రానప్పుడు మీరు ఏమి చేస్తారు?నేను అడిగినట్లు దేవుడు నా ట్యాంక్ నింపకపోయినా, రోడ్డు పక్కన పోతున్న వాళ్ళు మా కారులో పెట్రోలు పోసి సహాయం చేసారు. నా ప్రార్థనకు దేవుడు వేరే విధంగా సమాధానం ఇచ్చాడా? ఇది ఇంకా అద్భుతమా? మీ ప్రార్థనలకు ఎప్పుడైన జవాబు రాలేదా?? దాని గురించి మీకు ఎలా అనిపించింది? ఈ ప్రపంచం ప్రస్తుతం ఉన్న సంక్షోభం…

మీరు ప్రార్థన శక్తిని కనుగొన్నారా?

ప్రపంచంలో  ప్రార్థన  శక్తి అత్యంత తప్పుగా అర్ధం చేసుకోగల శక్తి కాగలదా? ఫిలిప్పీయులకు 4: 6 లో ప్రార్థన శక్తి గురించి నేను  ఒక  వాక్యం చూసాను, “దేనినిగూర్చియు చింతపడకుడి…” అపొస్తలుడైన పౌలు మనకు చింతకు అతి తక్కువ ఖరీదైన విరుగుడు ఇస్తాడు. చింతకు కారణంగా మందులు, దుర్వినియోగం చేసే మాదకద్రవ్యాలు  ప్రపంచంలో చాలా మందిమంది ప్రజలను వాడుతారు. మీరు గ్రహించగలరా? చింత / ఆందోళన ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధిగా మారింది, మరియు ప్రార్థన దీనికి సమాధానం. సాధారణంగా చేసే ఏ ప్రార్థన మాత్రమే కాదు, దేవునికి చేసే  ప్రార్థన. మీరు ఎప్పుడైనా ఆందోళన చెందుతారా? దాని ప్రభావాలను మీరు ఎలా ఎదుర్కొంటారు? మీరు ప్రార్థనను సరళమైన పదాల సమితి కాదు అని కనుగొన్నారని నేను నమ్ముతున్నాను, ప్రార్థన  ‘మీ విన్నపములు దేవునికి తెలియజేయడం’ (ఫిలిప్పీయులకు 4: 6) మీ ప్రార్థనలు వ్యక్తిగతతంగా…

మీ ప్రార్థనలన్నీ దేవుడు వింటున్నాడు

యేసు మీ పట్ల ప్రేమతో సిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు. మన జీవితాంతం, మరియు ముఖ్యంగా మన ప్రపంచంలో ఈ కష్ట సమయంలో… మన ప్రార్థనలను  ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన వింటున్నాడా  అని మనము పలు సార్లు అనుకుంటాము. ఇది సముద్రంలో విసిరిన సీసాలోని సందేశం గురించి ఆలోచించేలా చేస్తుంది… ఇది ఎంత సమయం పడుతుంది, ఎన్ని మైళ్ళు ప్రయాణిస్తుంది, ఇది సరైన వ్యక్తి చేతిలో అందేవరకు.. మీరు దేవునికి పంపుతున్న “సందేశాలు” ఏమైనా, గమ్యస్థానానికి చేరుకుంటాయి! ఆయన మీ ప్రతి ప్రార్థనను వింటాడు (సామెతలు 15:29) ఆయన మీ అభ్యర్ధనలను వింటాడు (కీర్తనలు 116:1-2) ఆయన మీ భాధను అర్థంచేసుకుంటాడు (కీర్తనలు 18:6) ఆయన మీ కన్నీళ్లను తుడుస్తాడు (కీర్తనలు 6:8) భయం లేదా నిగ్రహం లేకుండా ప్రతిరోజూ దేవునితో మాట్లాడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రార్థనలో పట్టుదలతో ఉండండి. మీ ప్రతి సమస్యకు దేవునికి పరిష్కారం ఉంది!

మీరు ప్రార్థనలో నిజాయితీగా ఉండగలరా?

భగవంతుడిని కించపరచకుండా మన ప్రార్థనలు కాపలా కావా, లేదా మన నిజమైన భావాలను వ్యక్తపరచటానికి స్వేచ్ఛగా ఉండాలా? ఇది అంత శక్తివంతమైన ప్రశ్న ఎందుకంటే మనందరిలో లోతుగా, దేవుని పట్ల గౌరవం మరియు పవిత్ర భయం ఉంది. కనీసం ఇది నేను నమ్ముతున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? నేను దేవునితో కాపలా కాసే ధోరణితో నిజంగా కష్టపడ్డాను. నేను అతని ఆమోదం పొందాలనుకున్నందున నా ముదురు భావోద్వేగాలు మరియు ఆలోచనలను నేను వెనక్కి తీసుకున్నాను. నేను ఈ ధోరణిని నా తండ్రితో ఉన్న సంబంధం నుండి బదిలీ చేశాను. చిన్నతనంలో, నా తండ్రిని ప్రసన్నం చేసుకోవటానికి నేను మంచి ప్రదర్శన చేయవలసి ఉందని నేను భావించాను. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు 13:11 లో ఇలా అంటాడు, “నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.” పూర్తిగా నిజాయితీ లేని తప్పుడు, ధర్మబద్ధమైన ప్రార్థనలను నేను అర్పించవలసి ఉందని అనుకోవడం అవివేకమే ..ఈ విధంగా దేవుడు నా తండ్రిలాంటివాడని అనుకోవడం నా  పిల్లతనం. . దేవుడు నిన్ను మరియు నన్ను బేషరతుగా ప్రేమిస్తాడు. ప్రార్థనలో మనం ఆయనకు ప్రతిదీ చెప్పగలం ఎందుకంటే ఆయన మనకు ఇప్పటికే తెలుసు, మరియు ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తాడు. దావీదు రాజు కీర్తనలు దీనిని నిష్కపటంగా వివరిస్తాయి. దావీదు రాజు తన శత్రువులను శిక్షించి తిరిగి చెల్లించమని దేవుడిని కోరాడు. అతను తన పాపాలను బహిరంగ పాటలో ఒప్పుకున్నాడు మరియు తన గత వైఫల్యాలకు సంబంధించి తన అవమానాన్ని వ్యక్తం చేశాడు. దేవుని బేషరతు ప్రేమను దావీదు అర్థం చేసుకున్నాడు. మనందరికీ…

యేసు సజీవంగా ఉన్నాడు!

బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది, ఏమనగా “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి” కీర్తనలు 34:8 యేసు, “మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.” మత్తయి 26:26 ఈ వాక్య భాగాలు ఒక రకమైన విచిత్రమైనవి అయినప్పటికీ, అవి మీ జీవితాన్ని శాశ్వతంగా శక్తివంతం చేసే ఆధ్యాత్మిక సత్యాన్ని కలిగి ఉంన్నాయి. మీకు మరింత శక్తి అవసరమా? వ్యాపారాన్ని నడపడానికి లేదా కుటుంబాన్ని పెంచడానికి మీకు శక్తి అవసరమా? లేదా ప్రలోభాలను ఎదిరించడానికి మీకు శక్తి అవసరమా? మన జీవితాలతో ముఖ్యమైన…

ఇది మంచిగా అనిపించట్లేదు

మీకు ఎప్పుడైనా ఒక చెడు అనుభవం మీ మంచి కొరకు మారిందా? యేసుకు కలిగిన ద్రోహం, హింస మరియు సిలువపై మరణంను “శుభ శుక్రవారం” అని ప్రజలు ఎందుకు అంటారు?ఇది భయంకరమైన రోజు యొక్క వర్ణన. అంటే, దాని నుండి వచ్చిన…

మీ ప్రార్థనలకు సమాధానం రావాలి అని అనుకుంటున్నారా?

ఊహించుకోండి….ఈ క్షణంలో దేవునికి ప్రార్థనల సంఖ్య పెరుగుతున్నట్లు. వాటిలో చాలావరకు కరోనావైరస్ గురించి ఉంటుంది. అన్ని ప్రార్థనలకు సమాధానం ఇవ్వబడుతుంది, కాని కొన్నింటికి సమాధానం రాకుండా ఉండవచ్చు. దీని గురించి నేను అలోచించాను, ప్రార్థించాను, మరియు ఇక్కడ ప్రభువు నాకు చూపించినది……

ఈ రోజు యేసు నామంలో ప్రార్థించండి

మనము యేసు నామంలో ఎందుకు ప్రార్థిస్తున్నామో మీకు తెలుసా? మనం ప్రార్థించేటప్పుడు ఆయన పేరును ఎందుకు ఉపయోగిస్తాము? కరోనావైరస్తో సహా శత్రువు యొక్క బలమైన కోటలను కూల్చివేసేందుకు మనం అతని శక్తివంతమైన పేరును ఎందుకు ఉపయోగించగలం? యేసు తన శిష్యులకు స్వర్గానికి…

కోపం మీ స్నేహితుడిగా మారగలదా?

కోపం మీ అతిపెద్ద శత్రువు, లేదా మంచి కోసం ఉపయోగించవచ్చా? నా కోపాన్ని ఎలా నియంత్రించాలో తెలియక నేను కొన్ని వెర్రి పనులు చేశానని నిజాయితీగా అంగీకరించగలను. నేను సెమినరీలో ఉన్నప్పుడు తలుపులో రంధ్రం చేశాను: అది ఇబ్బందికరంగా ఉండింది. ఒకసారి…

దేవుడు నీకు భవిష్యత్తును, ఆశను ఇవ్వాలనుకుంటున్నాడు

నీ జీవితానికి ఏ గురి లేక లేదా జీవితంలో భంధీగా ఉన్నట్లు అనిపిస్తుందా? ఒక అడ్డు గోడ దెగ్గర వచ్చి ఆగిపోయిన పరిస్థిలో ఉన్నవా? నీ కొరకు ఒక శుభవార్త ! దేవుడు నీకొక కొత్త భవిష్యత్తును ఇవ్వాలనుకుంటున్నాడు. “నేను మిమ్మునుగూర్చి…