ఈ రోజు మరియు ఎల్లప్పుడు ప్రభువును స్తుతిద్దాం!

25 May

Home | Miracles | ఈ రోజు మరియు ఎల్లప్పుడు ప్రభువును స్తుతిద్దాం!

స్తుతి, ఆరాధన యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాను, ఆకాశం నీలం లేదా బూడిద రంగులో ఉందా … ఎటువంటి పరిస్థుతులైన స్తుతి ఆరాధన ముఖ్యం అని నేను భావిస్తాను, ఎందుకంటే   మహిమలకు అర్హుడు!

దేవుణ్ణి స్తుతించడం ఎంత మంచిది! తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మను మహిమపరచడానికి మనం మొట్టమొదటగా చేస్తున్నప్పుడు, అది మనకు ఎంత మేలు చేస్తుందో నేను గ్రహించాను.

దేవుని వాక్యము , “సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.” యెషయా 61:3

హల్లెలూయా! అవును, ఈ అందమైన ఉల్లాస  వస్త్రం ఆయన మహిమ కోసమే!

ఈ వచనాలనుాతో కీర్తనల నుండి ప్రకటించండి. వాటిని మీ హృదయపూర్వకంగా ప్రకటించండి!

“యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.” కీర్తనలు 149:1

“యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.” కీర్తనలు 147:1

“యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.” కీర్తనలు 150:1&2

“యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.” కీర్తనలు 92:1-3

ఈ రోజు మరియు ఎల్లప్పుడు  ప్రభువును స్తుతిద్దాం!

شکر برای وجودتان!

20210728093415_6950b7da-8906-4d42-bdea-cf0dc8efa328

آیا مایل به دریافت پیغام های روزانه ی ما در جعبه ی دریافت ایمیل خود هستید؟ ثبت نام نمایید.



*By subscribing, you agree to the Jesus.net terms & conditions and Privacy Statement.

Leave a Comment