మొట్ట మొదట…దేవునితో సమయం కేటాయించండి.
మీ కుటుంబ జీవితం మరియు అనేక వృత్తిపరమైన లేదా స్వచ్ఛంద బాధ్యతల మధ్య, దేవునితో సమయాన్ని గడపడం కష్టమవుతుందా?
బైబిల్లో చదువుతాము, “ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.” మత్తయి సువార్త 6:33
ప్రతి రోజు క్రొత్త ప్రారంభం మరియు దేవుని దయను స్వీకరించడానికి కొత్త అవకాశాన్ని అందిస్తుంది.అందుకే మన రోజు మొదటి క్షణాల్లో మనం చేసేది మిగతావన్నీ నిర్ణయిస్తుంది.
మీరు మొదట ప్రభువును ఆశ్రయిస్తే, మిగిలినవన్నీ మీకు ఇవ్వబడుతుంది అనే వాగ్దానం చేయబడింది: దైవిక సదుపాయం, దైవిక సంబంధాలు, జ్ఞానం, వివేచన, సృజనాత్మకత…
నిజం చెప్పాలంటే..మనం ప్రార్థన చేయటానికి సమయాన్ని కేటాయించడం లేదు.నెరవేర్చాలని కలలు కనే అన్ని ప్రాజెక్టులు, మన కుటుంబాల కోసం దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ, మన వివాహిత జీవితాల కోసమో, దేవుని రాజ్యం కోసమో మనం పెంపొందించుకునే ఆశలన్నీ..వీటన్నిటిని ప్రార్థనలో సమర్పించటానికంటే ముఖ్యమైనది ఏది లేదు.
దేవుడు లేకుండా, నేను మలుపు తిప్పగలను, తిరగగలను, తడబడగలను, కాని నేను ఎప్పటికీ నిజంగా ప్రభావవంతంగా ఉండను! కాని.. దేవునితో నేను గొప్ప విజయాలు పొందగలను.
ప్రార్థన యొక్క రహస్యాలను ఇప్పటికే ఎరిగిన వాళతో సహవాసం చేయండి..ఎలా మార్గనిర్దేశం చేయాలో తెలుస్తుంది. మీ అవసరాలన్నింటినీ మీ పరలోకపు తండ్రికి తెలియజేయండి … ఆయన మీ పట్ల ఎంతో ఆసక్తి చూపుతాడు!
شکر برای وجودتان!