ఆశ కోల్పోయారా?
నేను ఒప్పుకొంటున్నాను, కొన్నిసార్లు నేను రేపు సూర్యోదయం అవుంతుందా అని నేను అంకుంటాను ఎందుకంటే ఈ మహమ్మారిన్నినివారించడానికి మనము చేసిన ప్రయత్నాలు ఫలించేటట్లు అనిపించదు… ఆశను కోల్పోతాము.
ఆశ అనేది మన జీవితాలన్నిటిలో ఒక ముఖ్యమైన అంశం. మంచి భవిష్యత్తు, జీవితం మరియు ఆరోగ్యం యొక్క ఆశ.
మీరు మంచి భవిష్యత్తును ఆశిస్తున్నారా? మీ ఆశలు ప్రతికూలత లేదా ఆలస్యం వల్ల నలిగిపోయాయా? బైబిల్ మనకు చెబుతుంది, “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.” సామెతలు 13:12
అలసట నా హృదయంలోకి ప్రవేశించినప్పుడు నా జీవితంలో ఒక సమయం నాకు గుర్తుంది. మా పెద్ద కుమార్తె ఒక విశ్వవిద్యాలయంలో తన మొదటి సంవత్సరంలో ఆమె మెడలో ఒక ముద్దను కనుగొన్నారు. నా భార్య డెనిస్ మరియు నేను ప్రతి తల్లిదండ్రులు భయపడే వార్తలను విన్నాము: “మీ కుమార్తెకు క్యాన్సర్ ఉంది.” నేను ఆ భయంకరమైన సమయాన్ని తిరిగి చూస్తున్నప్పుడు, నాకు గాయం, చెడ్డ వార్తలు మరియు మరింత చెడ్డ వార్తలు గుర్తుకు వచ్చాయి. ఇటువంటి సమయములో దేవుడు నాకు ఒక వాక్యాని గుర్తుకు చేసాడు: “ మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.” ఆదికాండము 50:20
మీకు ప్రస్తుతం ఈ వాక్యం అవసరమా? మీరు ఎదురుదెబ్బలు మరియు బాధలను ఎదుర్కొంటున్నారా? దేవుడు మీలో ఆశను తిరిగి నింపాలని కోరుకుంటున్నాడు. పరిస్థితులు మారవచ్చు. మీరు మార్చవచ్చు. దేవుడు మీకు సహాయం పంపుతున్నాడు.
ఈ రోజు, దేవుడు గొప్ప శుభవార్తను ప్రకటిస్తున్నాడు: “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.” 1 పేతురు 1:3-4
شکر برای وجودتان!