పురోగమించుటకు ఇదే సమయము

1 March

Home | Miracles | పురోగమించుటకు ఇదే సమయము

దేవుని సృష్టిని గమనించే విషయములో నేను ఎప్పుడు అలసిపోలేదు . ఆయన సృష్టి ఆశ్చర్యముగాను, అసాధారణమైనదిగాను, ఎంతో ఉన్నతమైనదిగాను, రంగురంగులుగా  అందమైనదిగా  ఉంటుంది . ప్రత్యేకముగా అడవిపుష్పాలను నేను ప్రేమిస్తాను, అవి అద్భుతమైనవి.

ఊహించండి .. చాల చల్లగా వుండే దేశములో చలికాలం ముగించబడే రోజులవి, చెట్లు మంచుతో నింపబడి వున్నాయి , భూమి తెల్లటి చలికాలపు వస్త్రములను విడువుటకు సిద్ధముగా  వున్నది , నేలపై మంచుపొర కప్పబడినట్లుంటుంది. కాలం ఆగినట్లుగా ఉంటుంది , ఆ సమయములో మెల్లగా అకస్మాత్తుగా చిన్న రెమ్మలు చిగురు పెడతాయి ; జీవిత విజయాలు !!! మంచుతో కప్పబడిన మార్గములో దారి చూపించు విధముగా చిన్న చిన్న చిగురులు సహాయపడతాయి , వాటి చిగురుల కొసల ద్వారా మార్గాన్ని చూపిస్తూ మాయమౌతాయి .

నీ జీవితములో కూడా అదేవిధముగా జరుగుతుంది ,నీ జీవితకాలమంతటిలో నీవుకూడా అనేకమైన ఋతువుల నుండి వెళుతుంటావు , కొన్ని ఋతువులు మిగిలిన ఋతువులకంటే చల్లగావుంటాయి. ఈ ఋతువులో కాలం ఆగిపోయినట్లుండును, రెండు ఋతువుల మధ్యకాలం లోని స్థితి  విజయవంతమైన ముగింపునకు నడుపుతుందా ?  ఈ కష్టం ఎప్పటికి తీరనిదిగానే ఉంటుందా ?

అవును .. అవును !! ఎందుకంటే విజయవంతమైన జీవితము మరణముయొక్క శక్తిని మ్రింగివేసినది! జీవితము ఒక మాటకన్న , ఒక పరిస్థితి కన్నా , చాలా విలువైనది . జీవితమంటే ఒక వ్యక్తి అది యేసు క్రీస్తు,  రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు .

ఈ విషయమును నీవు గమనించావా ? ఆయన జీవితం నిన్ను కప్పుచున్నది , నీ ప్రాణమునకు, హృదయమునకు, ఆలోచనలకు ; అనుమతిస్తుంది . అది నీ కలల విషయములోను , నీవు జీవిస్తున్న భూమిమీద ఎంతో  ఘనముగా బలముగాను , కృపతో ప్రవహిస్తూవున్నది .

విచ్చిన్నమైన జీవితం , విజయవంతమైన జీవితం !!!  నీ విజయం యేసుతోనే , మంచుతో కప్పబడిన స్థలమును నీవు దాటుదువు , సందేహము భయము అను మంచు పొరలను చీల్చుకొని నీవు ముందుకు పురోగమిస్తావు. అవరోధాలను అధిగమిస్తావు , దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు . నీకు విజయమును ఇచ్చునది దేవుడు మాత్రమే .

పురోగమించుటకు ఇదే సమయము! 

شکر برای وجودتان!

20210728093415_6950b7da-8906-4d42-bdea-cf0dc8efa328

آیا مایل به دریافت پیغام های روزانه ی ما در جعبه ی دریافت ایمیل خود هستید؟ ثبت نام نمایید.



*By subscribing, you agree to the Jesus.net terms & conditions and Privacy Statement.

1 Comments

  1. CH MOHAN on September 20, 2019 at 9:45 am

    Thak you JESUS

Leave a Comment