ప్రార్థనలో కొనసాగండి
నా జీవితంలో వందలాది మంది జవాబు లేని ప్రార్థనలతో నిరాశ చెందారు.
క్రొత్త క్రైస్తవుడిగా, నాకు దేవునిపై చాలా విశ్వాసము ఉండింది .ఆయన నా జీవితంలో కొద్ది సంవత్సరాలలో చాలా మేలులనుచేసాడు. నా విశ్వాసం పరీక్షించబడిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. నేను, నా నా కాబోయే భార్య మరియు ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణం చేస్తుండగా, కారులో పెట్రోలు అయిపోయంది. అతీంద్రియంగా నా ట్యాంక్ నింపమని దేవుడిని కోరినప్పుడు మొత్తం సమూహం ఒక అద్భుతం కోసం వేచి ఉంది. మేము వేచి ఉండి, వేచి ఉండి, దాన్ని ప్రారంభించడానికి చాలాసార్లు ప్రయత్నించాము, కానీ ప్రయోజనం లేకపోయింది.
మీ ప్రార్థనలకు సమాధానం రానప్పుడు మీరు ఏమి చేస్తారు?నేను అడిగినట్లు దేవుడు నా ట్యాంక్ నింపకపోయినా, రోడ్డు పక్కన పోతున్న వాళ్ళు మా కారులో పెట్రోలు పోసి సహాయం చేసారు. నా ప్రార్థనకు దేవుడు వేరే విధంగా సమాధానం ఇచ్చాడా? ఇది ఇంకా అద్భుతమా?
మీ ప్రార్థనలకు ఎప్పుడైన జవాబు రాలేదా?? దాని గురించి మీకు ఎలా అనిపించింది? ఈ ప్రపంచం ప్రస్తుతం ఉన్న సంక్షోభం కారణంగా మీరు ఇప్పుడే దీనిని ఎదుర్కొంటున్నారు …
బైబిలు ఇలా చెబుతోంది:
నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. యాకోబు 5:16
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. మత్తయి 18:20
దేవుడు ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాడని నేను నమ్ముతున్నాను, కాని ఆయన సమాధానాలను మనం మార్లు అర్థం చేసుకోవాటానికి చాలా కష్టపడుతాము.
ప్రార్థన చేయడం మానవద్దు…ప్రార్థన కన్న బలమైన ఆయుధం ఏదీ లేదు.
شکر برای وجودتان!
Good
yes