ఆయన పేరు “దేవుడు మీతో ఉన్నాడు”

18 June

Home | Miracles | ఆయన పేరు “దేవుడు మీతో ఉన్నాడు”

ఇది ఎంత అందమైన పేరు అనే పాట ఉంది..ఇది ఆయన పేరు, యేసు పేరు, ఆయనను ప్రభువుగా స్వీకరించిన మనలో ఉన్నవారికి ఎంత అధ్బుతమైనదని మనకు గుర్తుచేస్తుంది

ఈ రోజు, బైబిల్లో దేవుని పేర్లను కనుగొనమని నేను మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను!

ఆయన ఎల్షాద్దై, సర్వశక్తిమంతుడు (ఆదికాండము 17:1) ఈ పేరు ద్వారా, పరలోకంలో మరియు భూమిపై సర్వశక్తిగల దేవుడిగా దేవుడు తనను తాను వెల్లడిస్తాడు!

ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు ( నిర్గమకాండము 15:25-26).

ఆయన యెహోవా నిస్సీ ( నిర్గమకాండము 17:8-15).దేవుడు ఇక్కడ తనను తాను గౌరవం, బలం, ధైర్యం మరియు ప్రమేయం ఉన్న దేవుడిగా పరిచయం చేస్తాడు.

ఆయన యెహోవా రోహి, ఆయన నా కాపరి (కీర్తనలు 23:1)  ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరు ద్వారా తెలుసుకొని, ఒక్కొక్కరిని  చూసుకుంటాడు.

ఆయన యెహోవా షమ్మ, ప్రభువు ఉన్నాడు (యెహెజ్కేలు 48:35) ఈ పేరు దేవుని సర్వశక్తిని్ చెబుతుంది. దేవుడు ఎల్లప్పుడూ, ప్రతిచోటా ఉంటాడు. ఆయన సన్నిధి నుండి ఏమీ మరియు ఎవరూ తప్పించుకోలేరు. మనం ఆయనకు దూరంగా పరుగెత్తినా, ఆయన అక్కడ ఉంటాడు.

ఆయన యెహోవా ఒసేను, మన సృష్టికర్త ప్రభువు (కీర్తనలు 95:6) దేవుని యొక్క ఈ పేరు అన్ని జీవుల మూలం ఆయనలో ఉందని ధృవీకరిస్తుంది. అతను అన్నింటినీ సృష్టించాడు.

ఆయన ఎల్చాయిమ్, సజీవ దేవుడు (యెహొషువ 3:11)  దేవుడు సైద్ధాంతిక దేవుడు కాదు, జీవన దేవుడు!

ఆయన  ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు (మత్తయి 1:23) ఆయన దూరపు దేవుడు కాదు మనకు దగ్గరగా ఉన్న దేవుడు! .

ఆయన యేసు, రక్షణ కర్త (మత్తయి 1:21)  ఇతర పేర్లకు పైన ఉన్న పేరు, మానవులను రక్షించగల ఏకైక పేరు.

యేసు వాగ్దానాలలో ఒకదానిని మీతో నేను మీతో పంచుకొంటాను, “మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును.”  యోహాను 14:13

ఈ రోజు, ఆయన గొప్ప పేరు ఆధారంగా మీకు కావలసిన ప్రతిదాన్ని ఆయనను అడగండి!

شکر برای وجودتان!

20210728093415_6950b7da-8906-4d42-bdea-cf0dc8efa328

آیا مایل به دریافت پیغام های روزانه ی ما در جعبه ی دریافت ایمیل خود هستید؟ ثبت نام نمایید.



*By subscribing, you agree to the Jesus.net terms & conditions and Privacy Statement.

Leave a Comment