నీ కోసం దేవుడున్నాడు

2 March

Home | Miracles | నీ కోసం దేవుడున్నాడు

“నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.” (యోహాను 16 : 33)

దేవుడు నీకోసం ఉన్నాడని  నీవు తెలుసుకుంటే నిన్ను ఎవరూ ఆపలేరు . దేవుడు నీ జీవితము పట్ల కలిగి వున్నా కలలను నెరవేర్చుటకు నీవు ముందుకు సాగిన యెడల నీవు అవరోధాలు ఎదుర్కొంటావు, పోరాటాలు చేయవలసి వస్తుంది, శ్రమ పడవలసి ఉంటుంది. కానీ పరలోకము లేదా భూమిమీద ఉన్నవేవీ కూడా నిన్ను ఆపలేవు .

దేవుని యొక్క సహాయముతో ప్రతి అవరోధమును,అడ్డంకులను నీవు అధిగమించగలవు; కష్టం, శ్రమ అనునది ఎంత పెద్దదైన అది అసలు విషయమే కాదు.

అంతా తేలికగా ఉంటుందని ఆశించకు కానీ ఆయన చెప్పిన ఈ మాటలు జ్ఞాపకముంచుకొనుము “ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి వున్నాను ” నీ దృష్టిని  ఆయన మీద నిలుపుము .

యేసుకు సమస్తము సాధ్యమే , ఆయన ద్వారా నీవు విజయవంతునిగా ఉంటావు.ఆయన ద్వారా నీవు శ్రమలన్నిటి నుండి విడుదల పొందుతావు .ఆయన ద్వారా మాత్రమే నీవు విజయము సాదిస్తావు.

నాతో కూడా ప్రార్ధించమని ఆహ్వానిస్తున్నాను “ప్రభువైన యేసు నీవు ఈ లోకమును జయించి వున్నావు , ఈ లోకములో   ఎవ్వరూ నన్ను ఆపలేరు ఎందుకంటె  నేను నిన్ను వెంబడిస్తున్నాను. ఈ రోజు నిన్ను బట్టి ధైర్యము తెచుకొను చున్నాను, నీ నామములో నేను విజయవంతునిగా ఉందును గాక ఆమెన్.”

شکر برای وجودتان!

20210728093415_6950b7da-8906-4d42-bdea-cf0dc8efa328

آیا مایل به دریافت پیغام های روزانه ی ما در جعبه ی دریافت ایمیل خود هستید؟ ثبت نام نمایید.*By subscribing, you agree to the Jesus.net terms & conditions and Privacy Statement.

Leave a Comment