నీవు దేవుని నుండి ఏమి ఆశిస్తున్నావు
నీవు దేవుని నుండి ఏమి ఆశిస్తున్నావు, నేను దేనికి భయపడుచున్నానో అదే నాపైకి వచ్చెను. (యోబు 3:25). అయితే నేను విశ్వసించినట్లు నాకు కలిగెను
(మత్తయి 8:13). నేను పరలోక సంబంధమైన వాటిని ఆశించినప్పుడు నాకు తెలుసు అవి నాకు దొరుకునని. మన విశ్వాసాన్ని బట్టి మనకు జరుగును (మత్తయి 9:29).
నీవు దేవుని నుండి ఏమి ఆశిస్తున్నావు? కొన్ని అద్భుతాలనా ! లేక చిన్న అద్భుత మా!
ఉదా: నేనెప్పుడు కారు నిలుపుడానికి దేవుడు నా కొరకు స్థలము సిద్ధపరిచి యున్నాడని తెలుసు. అది నిజముగా జరుగును. ఒకసారి మేము పారిస్ లో ఒక్క మీటింగ్ వెళ్ళేటప్పుడు ఒకాయన మనము కారును ఎక్కడ ఆపుకొందామని నన్నడిగినప్పుడు, దానికై నాకు చింతలేదు. దేవుడు ముందే దానికి స్థలము పెట్టి యుంచునందిని, నేను చెప్పినట్లుగానే మీటింగ్ స్థలానికి రాగానే ఒకాయన తాను నిలిపిన కారును బయటకు తీసి మాకు స్థలము ఉంచెను.
విశ్వాస మనేది ఒక కండరము లాంటిది దానిని వాడినప్పుడు బలంగా ఉండును. ఈ రోజు విశ్వాసముతో అడుగు పెట్టు.దేవుని మీద ఆధారపడు నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు చూచెదవు. అద్భుతాలు పొందటానికి తలపులు తెరువుము.
ఈ రోజు విశ్వాసము లో అడుగుపెట్టు దేవుని ప్రతీ పనిలో ఆహ్వానించు. దాని ఫలితాలు చూచెదవు. అది అద్భుతాలు పొందడానికి ఒక ద్వారము.
شکر برای وجودتان!