దేవుడు నీ కొరకు తన కృపను చూపుటకు సంతోషించుచున్నాడు.
నీ తప్పుల యొక్క పరిమాణం నీపై దేవుని కి ఉన్న ప్రేమకు ఎన్నడూ సమానము కాలేదు. నా స్నేహితుడా ఇది చూడడానికి స్పష్టముగా ఉంటుంది అయినప్పటికీ కొన్ని సార్లు అపరాధ భావము యొక్క బరువుచేత నీవు నలిగిపోతున్న అనుభవము కలిగి యుంటావు. ఇటువంటి పరిస్థితిలో “నేను ప్రార్థన చేయలేను “లేదా “ఈ స్థితిలో నేను దేవుని దగ్గరకు వెళ్ళలేను .” అనుకుంటావు
దేవుని సహాయము లేకుండా ఏ ఒక్కరూ తనను తాను శుద్ధి చేసుకొనలేరు. దేవుడు మనలను ఎల్లప్పుడూ గమనించుచున్నాడు, మనలను విమోచించువాడు ఆయనే . కేవలము ఆయన దగ్గరకు వెళ్లుము, మరియు ఆయనను క్షమాపణ అడగవలసిన అవసరత వుంది అని అనుకుంటే, క్షమించమని ఆయనను అడుగుము. ఆయన మంచివాడు మరియు నమ్మదగినవాడు,ఆయన నీ పాపములను చెరిపివేయువాడు ! బైబిల్ లో యేసు ప్రభువు వారు ఈ విధముగా సెలవిచ్చియున్నాడు .
అయితే “నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.” మత్తయి 9 :13
నీవు ఏ స్థితిలో వున్నను దేవుడు నిన్ను అంగీకరించును , నీవు ఏ స్థితిలో వున్నావు అన్నది అసలు విషయమే కాదు . ఆయన తన చేతులు చాచి, తన కౌగిలిలో నీకు ఆదరణను ఇవ్వాలని ఆయన సిద్ధముగా వున్నాడు . ఆయన ప్రేమ కలవాడు కనికరముతో నిండి యున్నవాడు .
దేవుడు నీ కొరకు తన కృపను చూపుటకు సంతోషించుచున్నాడు!
నీవు ఇష్టపడినట్లయితే , ఈ ప్రార్థన నాతోకూడా చెప్పుటకు ఆహ్వానించుచున్నాను : “నా దేవా , నా పాపముల విషయమై నన్ను క్షమించవలసినదిగా వేడుకొనుచున్నాను, నా హృదయములోనుండి ఈ భారమును నీవు తీసివేయవలసినదిగా వేడుకొనుచున్నాను. నిజమైన స్వేచ్ఛతో నేను నీలో జీవించాలనుకుంటున్నాను మరియు నీ కృప నాకు కావాలి నీ కనికరమునకై కృతఙ్ఞతలు , యేసు నామములో ఆమెన్.”
شکر برای وجودتان!