స్తుతి ఆరాధన నిన్ను పైకిలేవనెత్తును
మీ గాయాలు చాలా లోతుగా ఉన్నాయని, వాటిని నయం చేయలేమని మీరు అనుకుంటారా? మీ గతం చాలా భయంకరమైనది, అది మీకు కలిగించే బాధలను తప్పలేరు అని అనుకుంటారా?మీకు ఒక నిరీక్షణ … వీటన్నిటి నేపథ్యంలో దేవుడు మీకు శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చాడు: స్తుతి ఆరాధన!
మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా మీరు మీ ప్రేమను ఆయనకు తెలియజేస్తారు….రాజులకు రాజుయైన ప్రభువు యొక్క సన్నిధిలో మీరు ప్రవేశిస్తారు. బైబిలు చెబుతోంది, “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” (యాకోబు 4:8)
దేవుని ఉనికి…
మిమ్మల్నిస్వస్థపరుస్తుంది
మీగాయాల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది
మీగతం నుండి మిమ్మల్ని స్వస్థపరుస్తుంది
మీకుశోకం లేదా నొప్పి కలిగించే విషయాల గురించి మీకు ఓదార్పునిస్తుంది
COVID-19 మన ప్రపంచాన్ని మార్చింది. మీరు అనుకున్నట్లుగా లేదా ఆశించిన విధంగా దేవుడు పరిశ్కారం చేస్తాడని మీకు కొన్నిసార్లు అనిపిస్తుందా? అతను దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు మరియు స్తుతి ఆరాధన చేయాలనుకున్న విషయంమీ తలంపులోరాకపోవొచ్చు కావచ్చు.
అవును, ఇలాంటి సమయాల్లో దేవుణ్ణి స్తుతించడం త్యాగమే. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13:15, “కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము” మీరు ఈ “స్తుతియాగము” తీసుకువచ్చినప్పుడు, దేవుని గొప్పతనం మరియు శక్తి గురించి మీ అవగాహన బలంగా మారుతుంది. ఆయనపై మీ నమ్మకం పెరుగుతుంది, మరియు దేవుని పట్ల మీకున్న ప్రేమ మీ ప్రతికూల భావాలను మరియు గాయాలను భర్తీ చేస్తుంది.
కాబట్టి, ఈ రోజు ఆయనను స్తుతిస్తాము ఎందుకనగా ఆయన మన స్తుతికి అర్హుడు.
شکر برای وجودتان!